
● ప్రజలకు సీఎం స్టాలిన్ పిలుపు ● ప్రతి ఒక్కరి జీవన ప్ర
సాక్షి, చైన్నె: డీఎంకో ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల పాటూ అమలు చేసిన బృహత్తర పథకాలతో లబ్ధి పొందిన వారి ఆనందాన్ని పంచుకునే విధంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ విభాగాల నుంచి లబ్ధిదారులు 390 మందిని ఆహ్వానించి సంక్షేమ పథకాలు పంపిణీ చేసి సత్కరించారు. నాలుగు సంవత్సరాల విజయాలను తెలియజేస్తూ లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే, యువజన సంక్షేమం, క్రీడల శాఖ నేతృత్వంలో నలుగురు క్రీడాకారులకు రూ.31 లక్షలు విలువతో ప్రోత్సాహకాలను సీఎం స్టాలిన్ అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, తంగం తెన్నరసు, ఎం. సుబ్రమణియన్, ఎస్‌ఎస్ శివశంకర్, పీకే శేఖర్ బాబు, అన్బిల్ మహేశ్, టీఆర్‌బీ రాజా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం మురుగానందం పాల్గొన్నారు.
ఆనందంతో..
ఈ వేడుకలో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, ద్రావిడ మోడల్ పాలన ప్రణాళికల ఫలితమే నేడు తమిళనాడును ఆనంద సాగరంలో ముంచుతోందని వ్యాఖ్యానించారు. ఈ పాలనలో తమిళనాడు ఉన్నతంగా, గాంభీర్యంగా నిలబడి ఉన్నట్టు వివరించారు. తమిళనాడుప్రజలు ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలన్నీ ఈ ప్రభుత్వం తక్షణం పరిష్కరిస్తూ వస్తున్నదని తెలిపారు. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసి.. ప్రజల విశ్వాసానికి కట్టుబడి హామీలను నేరవేరుస్తూ వచ్చినట్టు వివరించారు. సమస్యలు ఎదురైనా, అడ్డుంకులు వచ్చినా తగ్గ లేదని, విజయాల జాబితాను సిద్ధం చేసుకునే విధంగా పాలన సాగిందన్నారు. ఇక్కడ అనేక మంది లబ్ధిదారులు చేసిన ప్రసంగం తన మనస్సులో ఆనందాన్ని నింపడమే కాదని, పేదల కన్నీళ్లు, అణచి వేతకు గురయ్యే వారికి బాసటగా ఈ సమాజం సమానత్వం వైపు పయనించాలన్న ఆకాంక్ష పెరిగిందన్నారు.
సామాజిక న్యాయం స్థాపించబడాలి..
సామాజిక న్యాయం స్థాపించ బడాలన్నది ఓ ప్రయోజనం అని తాను భావిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కుటుంబానికి సూర్యోదయం (ఉదయ సూర్యుడు)తో వెలుగు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశామన్న ఆత్మ సంతృప్తి తనకు ఇక్కడ మాట్లాడిన వారి ద్వారా కలిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ బృహత్తర పథకాలను గుర్తుచేస్తూ, లబ్ధి పొందిన వారి కళ్లలోని ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తూ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాజెక్టులు ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలను అందించాయని గుర్తు చేస్తూ, ఇదేఒక్కటే కాదు సామాజిక ప్రయోజనాలను కూడా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ పదవీ కాలం సంవత్సర కాలం ఉందని గుర్తు చేస్తూ, అందరి మద్దతుతో తదుపరి శాసనసభ ఎన్నికల్లో గెలుస్తామని, ద్రావిడ మోడల్ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కరుణానిధి సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న స్టాలిన్
బస్సులకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్

● ప్రజలకు సీఎం స్టాలిన్ పిలుపు ● ప్రతి ఒక్కరి జీవన ప్ర