తిరుత్తణి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెంచే లక్ష్యంతో అవగాహన ప్రచారం చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి యూనియన్‌లోని ఎస్.అగ్రహారం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో శతజయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల హెచ్‌ఎం ఎయిళసు అధ్యక్షత వహించారు. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి అడ్మిషన్లు పొందేందుకు ఉత్సాహం చూపిన ఐదుగురు విద్యార్థులను మేళతాళాలతో ఉపాధ్యాయులు, గ్రామీణులు కలిసికట్టుగా ఊరేగింపుగా పాఠశాలకు తీసుకొచ్చారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 1వ తరగతిలో చేరిన విద్యార్థులకు పూలమాలలు వేసి బొమ్మలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామీణులు పండ్లు, విద్య ఉపకరణాలు సహా వరుస పాఠశాలకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం గ్రామీణులకు బిరియానీ పంపిణీ చేశారు. సాయంత్రం పాఠశాలలో శత జయంతి, వార్షిక వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు చలపతి, జోస్మిన్, తిరుత్తణి తూర్పూ మండల డీఎంకే కార్యదర్శి రాజేంద్రన్, మున్సిపల్ కౌన్సిలర్ శ్యామ్‌సుందర్, కలైసెల్వి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామీణులు పాల్గొన్నారు.