చైన్నెలో రౌడీ, చిదంబరంలో దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో రౌడీ, చిదంబరంలో దొంగ అరెస్టు

Mar 22 2025 12:31 AM | Updated on Mar 22 2025 12:30 AM

సేలం: చైన్నె పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక పేరు మోసిన రౌడీని పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తుపాకీతో కాల్చి, అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకు డి నుంచి చైన్నెకి వచ్చి ఆదంబాక్కంలోని ఒక ఆభరణాల దుకాణం యజ మాని కుమారుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేయడానికి కుట్ర పన్నిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తూత్తుకుడికి చెందిన పేరుమోసిన రౌడీ మహారాజా (31) తిరునల్వేలి ప్రాంతంలో దాక్కున్నాడని అందిన సమాచారం ఆధారంగా, గిండి స్పెష ల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తిరునల్వేలి మార్కెట్‌ ప్రాంతంలో దాక్కు న్న రౌడీ మహారాజును అరెస్టు చేసి చైన్నెకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నేరానికిఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని తిరిగి పొందడానికి పోలీసులు వెళ్లగా అతను దాచిపెట్టిన తుపాకీతో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఒక పోలీసు అధికారిపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రౌడీ మహారాజాను సబ్‌ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణన్‌ తుపాకీతో కాల్చి, అరెస్టు చేశాడు. దీంతో గాయపడిన రౌడీ మహారాజా చైన్నె ప్రభు త్వ రాయపేట ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై గిండి పోలీసులు, వేలచ్చేరి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

చిదంబరంలో దొంగ అరెస్టు

పోలీసును కత్తితో నరికి తప్పించుకునేందుకు ప్రయత్నించిన పేరుమోసిన దొంగను పోలీసులు కాల్చి పట్టుకున్న ఘటన చిదంబరంలో కలకలం రేపింది. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని వల్లంపడుగై సిధాన్‌ సలై నివాసి గజేంద్రన్‌ (35) ఇంట్లో గత 18వ తేదీన ఒక గుర్తుతెలియని వ్యక్తి బంగారు నగలను దొంగిలించాడు. ఫిర్యాదు ఆధారంగా, అన్నామలై నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో, గురువారం రాత్రి చిదంబరం నుంచి ఆస్పత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీ చేశారు. ఆ సమయంలో వారు బైక్‌పై హెల్మెట్‌ ధరించి వేగంగా వెళ్తున్న వ్యక్తిని ఆపి ప్రశ్నించారు. అతను కన్యాకుమారి జిల్లాలోని కట్టువిలై సమీపంలోని పిల్లయర్గుణం ప్రాంతానికి చెందిన స్టీఫెన్‌ (38) అని, గజేంద్రన్‌ ఇంట్లో నగలు దొంగిలించాడని తేలింది. దీని తరువాత, అన్నామలై నగర్‌ పోలీసులు స్టీఫెన్‌ను అరెస్టు చేసి, 10 సవర్ల్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో, చోరీకి ఉపయోగించిన ఆయుధాలను చిత్తలపాడి రోడ్డు పక్కన ఉన్న ఒక తాటి చెట్టు దగ్గర పాతి పెట్టినట్లు స్టీఫెన్‌ చెప్పినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఇన్‌స్పెక్టర్‌ అంబేడ్కర్‌, పోలీసులు గురువారం స్టీఫెన్‌తో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. చిత్తలపాడి రోడ్డులోని ముళ్లపొద వద్ద ఒక్క తాటి చెట్టు రాగానే, స్టీఫెన్‌ అకస్మాత్తుగా తాను దాచిన కత్తితో పోలీసు జ్ఞానప్రకాష్‌ చేతిని నరికి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇన్‌స్పెక్టర్‌ అంబేడ్కర్‌ ఆత్మరక్షణ కోసం తుపాకీతో స్టీఫెన్‌ కాలిపై కాల్చాడు. మోకాలి కింద బుల్లెట్‌ దిగడంతో స్టీఫెన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని రక్షించి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన పోలీసు జ్ఞానప్రకాష్‌ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

చైన్నెలో రౌడీ, చిదంబరంలో దొంగ అరెస్టు 1
1/1

చైన్నెలో రౌడీ, చిదంబరంలో దొంగ అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement