వేలూరు: రాణిపేట జిల్లా రత్నగిరి బాలమురుగన్ స్వామిజీ వార్షికోత్సవం, 58వ అన్నదాన కార్యక్రమం ఆలయ ఆవరణలో జరిగింది. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఇందులోభాగంగా ఆలయంలోని శ్రీవళ్లి, దేవయాని సమేతబాల మురుగన్‌స్వామికి పారంపర్య ధర్మకర్త బాల మురుగన్ స్వాములు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపారాధన, పుష్పాభిషేక పూజలు చేసి ప్రత్యేక అన్నదానం చేశారు. ఇందులో కలవై సచ్చిదానం స్వామిజీ, బ్రహ్మపురం ఆధీనం సిద్ధంజి మేగానంద స్వామిజీ, కార్యనిర్వహణ అధికారి శంకర్, రాణిపేట జీకే ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ సంతోష్‌గాంఽధీ, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి సుకుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పుష్పాలంకరణలో ఉన్న స్వామివారిని ఊరేగించారు.