వేలూరు: దివ్యాంగుల విద్యార్థుల్లో సంతోషం తీసుకొచ్చేందుకే తిరుపత్తూరు జిల్లాలోని ఏలగిరి కొండకు ఒక్కరోజు పర్యాటకానికి పంపుతున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బధిర పాఠశాల నడుస్తోంది. ఇందులో 48 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడంతో పాటు శిక్షణ పొందుతున్నారు. వీరు ఒకే చోట ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతన్నారని ఉద్దేశంతో ఒక్కరోజు పర్యాటకాన్ని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థుల బస్సును కలెక్టర్ సుబ్బలక్ష్మి ప్రారంభించి విద్యార్థులకు పుష్పగుచ్ఛం ఇచ్చి పంపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బధిర విద్యార్థుల ఒక్క రోజు పర్యాటకం కోసం ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆహారం, బస్సు వసతి ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల శాఖ సంక్షేమ శాఖ అధికారి శరవణన్ పాల్గొన్నారు.