–ఇద్దరి అరెస్టు
తిరువళ్లూరు: అంబత్తూరు బస్టాండ్ నుంచి ఆటోలో తరలిస్తున్న 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు బస్టాండులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో కూర్చుని అనుమానాస్పదంగా ప్రవ ర్తిస్తుండడంతో స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం కలిగిన పోలీసులు వారిద్దరి బ్యాగులను తనిఖీ చేశారు. తనిఖీల్లో 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విచారణ జరిపారు. విచారణలో వ్యక్తులు చెంగల్‌పట్టు జిల్లా కోవలం గ్రామానికి చెందిన కాళేషా మస్తాన్(25), కాంచీపురం జిల్లా కళిపట్టూరు గ్రామానికి చెందిన రామ్‌కుమార్ కుమారుడు భరత్‌కుమార్(23)గా గుర్తించారు. వీరు ఆంధ్ర నుంచి రైలులో గంజాయిని జనసంచార ప్రాంతాలే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.