తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

Mar 22 2025 12:30 AM | Updated on Mar 22 2025 12:29 AM

సేలం: షార్జా నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి అక్రమంగా తరలించిన రూ.70 లక్షల విలువ చేసే బంగారాన్ని అధికారులు గురువారం రాత్రి స్వాధీ నం చేసుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయానికి షార్జా నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల విమానం గురువారం రాత్రి వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను విమానాశ్రయ ఇంటలిజెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఒక ప్రయాణికుడి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు తన శరీరంలో 780 గ్రాముల బరువు గల రూ.71లక్షల విలువ చేసే బంగారం ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

211 నక్షత్ర తాబేళ్ల్లు స్వాధీనం

అన్నానగర్‌: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 211 నక్షత్ర తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ సమావేశం జరుగుతుండడంతో చైన్నె పోర్ట్‌ ప్రాంతంలో పోలీసులు నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్త్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజా, ఇన్‌స్పెక్టర్‌ లోకేశ్వరి నేతృత్వంలో పోలీసులు ఆర్‌బీఐ కార్యాలయం సమీపంలోని రాజాజీ రోడ్డులో వాహన తనిఖీలు చేశారు. ఆ సమయంలో పోలీసులు వేగంగా వస్తున్న ఆటోను ఆపి, సోదాలు చేశారు. ఆటోలో రెండు బస్తాలు ఉన్నట్టు గుర్తించి తనిఖీ చేశారు. అందులో 211 నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో యాసిన్‌ను అరెస్టు చేశారు. అనంతరం నక్షత్ర తాబేళ్లతోపాటు, నిందితుడిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీనిపై అటవీశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఆకట్టుకున్న అర్జున తపస్సు

పళ్లిపట్టు: పొదటూరుపేటలోని ద్రౌపదీ దేవి ఆలయంలో అగ్నిగుండ వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అర్జున తపస్సు ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో గ్రామీణులు పాల్గొన్నారు. అర్జున వేషధారి మెట్టు మెట్టుకూ ప ద్యాలు పాడుతూ ఈశ్వరుడి కోసం అర్జునుడి తపస్సు ఆకట్టుకుంది. చివరగా అర్జునుడు తనతో తీసుకెళ్లిన నిమ్మకాయలు, పండ్లు, విబూది ప్రసాదాలను భక్తులపై చల్లారు. వాటి కోసం సంతానప్రాప్తి లేని మహిళలు తడిబట్టలతో వరపడ్డారు. ఆదివారం అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా భక్తులు కంకణాలు ధరించి దీక్షలు చేపట్టారు.

103 కిలోల

గంజాయి స్వాధీనం

ఇద్దరి అరెస్టు

అన్నానగర్‌: పల్లావరం సమీపంలో గురువారం రాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి చైన్నె మీదుగా విలాసవంతమైన కారులో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు శంకర్‌ నగర్‌ పోలీసులకు గురువారం రాత్రి పక్కా సమాచారం అందింది. దాని ఆధారంగా తాంబరం–మధురవాయల్‌ బైపాస్‌లోని అనగపుత్తూరు వంతెనపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటు వైపు వస్తున్న కర్ణాటక నంబర్‌ ప్లేట్‌ ఉన్న ఓ లగ్జరీ కారును పోలీసులు అడ్డుకుని సోదాలు చేశారు. కారులో పెద్ద బ్యాగులో 103 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. శంకర్‌ నగర్‌ పోలీసులు కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో మదురై జిల్లా ఉసిలంబట్టి అమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన డేనియల్‌ రాజా (34), పాండియన్‌ నగర్‌, మేలమడై, మదురై రెండో వీధికి చెందిన పరమన్‌ (45) నిందితులుగా గుర్తించారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తక్కువ ధరకు గంజాయిని పెద్దమొత్తంలో కొనుగోలు చేసి తమిళనాడు అంతటా రవాణా చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ స్మగ్లింగ్‌లో ఎవరెవరున్నారనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే పూందమల్లి పక్కనే ఉన్న సెన్నీరుకుప్పం ప్రాంతంలో ఆటో నడుపుతున్నట్లు నటించి కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న అదే ప్రాంతానికి చెందిన శంకర్‌ (23), అతని స్నేహితులు ఆకాష్‌ (21), ప్రవీణ్‌ (24), సయ్యద్‌ ఇసాక్‌ (19)లను పోలీసులు అరెస్టు చేశారు.

తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం 
1
1/2

తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం 
2
2/2

తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement