ఆవిష్కరణలకు వేదికగా ఐసీసీ ఐడియా | - | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణలకు వేదికగా ఐసీసీ ఐడియా

Mar 21 2025 2:06 AM | Updated on Mar 21 2025 2:00 AM

సాక్షి, చైన్నె: కొత్త ఆవిష్కరణలు, ప్రోత్సాహం, భవిష్యత్తు నిర్మాణానికి పరిశోధకులకు ఐసీసీ ఐడియా ఒక వేదికగా నిలిచింది. ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టె క్నాలజీలో గురువారం ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్నోవేటివ్‌ డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లికేషన్స్‌–2025 కార్యక్రమం జరిగింది. పపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు , పరిశ్రమ నిపుణులను ఈ కార్యక్రమం ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది. ఎస్‌ఆర్‌ఎం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌. పొన్నుసామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన ముంబైకి చెందిన ఐసీఐ అధ్యక్షుడు డాక్టర్‌ వి. రామచంద్ర తన ప్రసంగంలో ఇంజినీరింగ్‌ అభివృద్ధి, సిమెంట్‌ టెక్నాలజీలో స్థిరమైన నిర్మాణ పద్ధతులు , ఆవిష్కరణల పాత్రను వివరించారు. పరిశ్రమ–విద్యా సహకారం , మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భవిష్యత్తు పురోగతిపై విలువైన ధృక్పథాలను విశదీకరించారు. కొచ్చిన్‌లోని జియో స్ట్రక్చరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అనిల్‌ జోసెఫ్‌ మాట్లాడుతూ, సివిల్‌ ఇంజనీరింగ్‌ , స్థిరమైన మౌలిక సదుపాయాలలో పురోగతి గురించి వివరించారు. నిర్మాణ పరిశ్రమ, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌, 3డీ ప్రింటింగ్‌ , ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఆధునిక సాంకేతికతల పెరుగుతున్న ప్రభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రంజిత్‌ దిసానాయకే, డాక్టర్‌ అంజయ్‌ కుమార్‌ మిశ్రా, డాక్టర్‌ అయోతిరామన్‌ ఆర్‌., మరియు ఎర్‌. జయశంకర్‌ కె. వంటి ప్రముఖులు తమన ప్రసంగాలలో అత్యాధునిక పరిశోధన, పరిణామాలపై వ్యాఖ్యలు చేశారు.శ్రీలంకలోని కొలంబోలోని కర్టిన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ రంజిత్‌ దిసానాయకే తన ప్రసంగంలో వినూత్న నిర్మాణ పద్ధతులు , స్థితిస్థాపక మౌలిక సదుపాయాల భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేశారు. భద్రత , నాణ్యత, పెంచడానికి ఆధునిక మౌలిక సదుపాయాలు, భూకంప నిరోధక డిజైన్లను సమగ్రపరచడం గురించి చెప్పారు.అలాగే, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం గురించి కూడా చర్చించారు. నేపాల్‌లోని మాధేష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ అంజయ్‌ కుమార్‌ మిశ్రా డీన్‌ నిర్మాణ పనితీరును పెంపొందించడంలో అధునాతన పదార్థాల పాత్రను హైలైట్‌ చేశారు, ఐఐటీ తిరుపతి నుంచి వచ్చిన డాక్టర్‌ అయోద్య రామన్‌ జియోటెక్నికల్‌ ఇంజనీరింగ్‌లో పురోగతి గురించి చర్చించారు, మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి వినూత్నమైన భూ మెరుగుదల పద్ధతులు, భూకంప ఉపశమన వ్యూహాలపై దృష్టి సారించారు. ముంబైలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎర్‌. జయశంకర్‌ మాట్లాడుతూ, నిర్మాణ పద్ధతులు, ప్రాజెక్ట్‌ నిర్వహణలో పురోగతిపై ప్రసంగం చేశారు.ఈ సమావేశం ఇంజనీరింగ్‌, టెక్నాలజీలో మార్గదర్శక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసే వివిధ సాంకేతిక సెషన్‌లు , చర్చలను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement