కయాడు లోహర్ జోరు
తమిళసినిమా: ఏదైనా విజయం అందే వరకే. ఆ తరువాత క్రేజ్ దానంతట అదే వస్తుంది. ఇక అవకాశాల గురించి వేరే చెప్పాలా? వరుస కట్టేయవూ. ఇందుకు తాజా ఉదాహరణ నటి కయాడు లోహర్‌నే. గత రెండు నెలల క్రితం వరకూ ఈ అమ్మడు ( యువ కథానాయికల్లో ) గుంపులో గోవిందనే. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ అస్సామీ బ్యూటీ 2021లో ముగిల్‌పేటే అనే కన్నడ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తరువాత మలయాళంలో పతోన్‌పదం చిత్రం, తెలుగులో అల్లూరి చిత్రం, ప్రేమ్ యు అనే మరాఠి చిత్రం అంటూ ఒక్కో భాషలో ఒక్కో చిత్రంలో నటించింది. అయితే వీటిలో ఏ చిత్రానికి దక్కని విజయం ఇటీవల తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో వరించింది. అంతే కాదు ఈ చిత్రం విజయం కయాడు లోహర్‌ను క్రేజీ హీరోయిన్‌ను చేసింది. అంతే ఆ ఒక్క విజయం చాలు .మరిన్ని అవకాశాలు వచ్చి పడటానికి. ప్రస్తుతం అధర్వ సరసన ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో జాక్‌పాట్ ఈమెను వరించినట్లు సమాచారం. సంచలన నటుడు శింబు ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన థక్ లైఫ్ చిత్రంలో శింబు ముఖ్య పాత్రను పోషించారు. ఈయనకు జంటగా నటి త్రిష నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు శింబు కథానాయకుడిగా నటించనున్న ఆయన 49వ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లినుంది. ఈ చిత్రానికి రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వమించనున్నారు. ఇందులో నటి కయాడు లోహర్ నాయకిగా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఆమెతో పాటూ నటి మృణాల్ ఠాకూర్ కూడా నాయకిగా నటించనున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తెలుగు చిత్రం సీతారామమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాధి భామ ఇంతకు ముందు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు శింబు హీరోగా నటించే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇకపోతే ఇందులో నటుడు సంతానం ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.
మామూలుగా లేదుగా..
మామూలుగా లేదుగా..
మామూలుగా లేదుగా..
మామూలుగా లేదుగా..
మామూలుగా లేదుగా..
మామూలుగా లేదుగా..