సాక్షి, చైన్నె : నీట్, జేఈఈ తదితర పరీక్షలకు విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేయడానికి అత్యున్నత శిక్షణ అందించడం తమ లక్ష్యం అని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్ – బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కొత్త లెర్నింగ్ సెంటర్‌ను టీఎన్ హెచ్‌బీ 3682 – తిరువళ్లూరు బైపాస్ రోడ్డులోని కాకలూరులో ఏర్పాటు చేశారు. సోమవారం దీనిని ధీరజ్‌కుమార్ మిశ్రాతోపాటు రాష్ట్రహెడ్ శివప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎస్‌జీహెచ్ రాంకీలు హాజరై ప్రారంభించారు. ఈ సెంటర్‌లో ఎనిమిది తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం బ్యాచ్‌లలో శిక్షణ అందించనున్నారు. ఈసందర్భంగా ధీరజ్ కుమార్ మాట్లాడుతూ జేఈఈ, నీట్‌తోపాటు ఈ కేంద్రం ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వారి విద్యా ప్రాథమికాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఫౌండేషన్ స్థాయి కోర్సులను కూడా అందిస్తుందన్నారు. ఇది విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్‌ను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశామన్నారు. బలమైన విద్యా పునాదులు, భావనాత్మక స్పష్టత , వివిధ పోటీ పరీక్షలలో రాణించడానికి ఆత్మవిశ్వాసంతో విద్యార్థులను శక్తివంతం చేయడంపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు.