సాక్షి, చైన్నె : అఖిల భారత రైఫిల్ షూటింగ్‌పోటీలు చైన్నెలో సోమవారం ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగాపోలీసు అధికారులు ఈ పోటీలకు తరలి వచ్చారు. అఖిల భారత పోలీసు విభాగం, తమిళనాడుపోలీసు సంయుక్తంగా చెంగల్పట్టు జిల్లా ఒత్తివాక్కంలోని తమిళనాడు కమాండో బలగాల శిక్షణా కేంద్రంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22వ తేదీ వరకు ఈపోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు 704 మంది పోలీసు అధికారులు, రైఫిల్ షూటింగ్‌లో నిష్ణాతులుగాఉన్న పోలీసులు తరలి వచ్చారు. 3 కేటగిరిలలో 13 బ్యాచ్‌లుగా ఈ పోటీలు జరగనున్నాయి.
కలెక్టరేట్‌లో
వానరాల బెడద
తిరువళ్లూరు: కలెక్టరేట్‌లో వానరాల బెడద అధికంగా ఉందని, వీటిని పట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కలెక్టరేట్‌లో వానరాల బెడదతో కార్యాలయానికి వచ్చేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగులు, ప్రజలు పార్కింగ్ చేసే వాహనాల, లంచ్‌బాక్సులను సైతం చిందరవందరగా చేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్న వానరాలను పట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు.
ఎన్నూరులో ఆదిపరాశక్తిసిద్ధర్ పీఠాలకు కుంభాభిషేకం
కొరుక్కుపేట: చైన్నె ఎన్నూరు కత్తివాక్కం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆదిపరాశక్తి సిద్ధర్ శక్తి పీఠం, సాలిగ్రామంలోని సిద్ధర్ శక్తిపీఠంల కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక ఉద్యమ ఉపాధ్యక్షులు గోపీ సెంథిల్ కుమార్ పాల్గొని గోపురం కలశాలపై పవిత్రజలం పోసి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో ఆదిపరాశక్తి అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజలు చేపట్టారు. అలాగే సాలిగ్రామంలో జరిగిన కుంభాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొనగా అందరికీ అన్నదానం చేశారు. ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలర్ 85వ అవతారోత్సవం సందర్భంగా 85 మందికి వస్త్రదానం చేశారు. ముత్తు రామలింగం వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా సరుకులు అందజేశారు. ఏర్పాట్లను ఎన్నూరు సిద్ధర్ శక్తి పీఠం అధ్యక్షులు మాధవన్ తదితరులు పర్యవేక్షించారు.
నవవధువు ఆత్మహత్య
అన్నానగర్: పెళ్లయిన నెల రోజులకే ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్ (27), భాగ్యలక్ష్మి (24) 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ స్థితిలో నెల కిందట వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సెలవు దినమైన ఆదివారం భుపాలన్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు అదే ప్రాంతంలోని మైదానానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాగ్యలక్ష్మి తలుపు తీయలేదు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన భూపాలన్ షాక్‌కు గురయ్యాడు. ఇంటి పడక గదిలో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొరటూరు పోలీసులు అక్కడికి చేరుకుని భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో భూపాలన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించి, భూపాలన్‌ను అదుపులోకి తీసుకుకి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణను ఆర్టీఓకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం అందించారు.