తమిళసినిమా: ప్రముఖ సంగీతదర్శకుడు యువన్ శంకర్‌రాజా వైఎస్‌ఆర్ ఫిలింస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మంచి యూత్ ఫిలింస్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈయన తాజాగా సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం స్వీట్‌హార్ట్. రియోరాజ్ , గోపిక రమేశ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా స్వినీత్ ఎస్. సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రేమికుల మధ్య మోహం, మోదం వంటి పలు అంశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టెయినర్ రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత 14వ తేధీన విడుదలై ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. దీంతో తాను పని చేస్తున్న చిత్ర కార్యక్రమాల కోసం విదేశం వెళ్లిన స్వీట్‌హార్ట్ చిత్ర నిర్మాత, సంగీతదర్శకుడు తన చిత్రానికి వస్తున్న పాజిటివ్ రిజల్ట్ గురించి తెలుసుకుని ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటూ తన చిత్ర యూనిట్ సభ్యులకు వాట్సాప్ పోన్ ద్వారా ఆ ఆనందాన్ని పంచుకున్నారు. స్వీట్‌హార్ట్ చిత్రం బాగుందనే మౌత్‌టాక్ రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండడంతో మంచి విజయాన్ని అందించినందుకు ఆయన చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. దీని గురించి చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర ప్రారంభ దశలో యువన్‌శంకర్ రాజా సంగీత కచేరిలో చిత్ర హీరోహీరోయిన్లు కలుసుకునే వంటి పలు సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనీ, చిత్ర సంగీత దర్శకుడు, నిర్మాత యువన్ శంకర్‌రాజా తమకు అభినందనలు తెలపడం మరచిపోలేని అనుభవం అని పేర్కొన్నారు.
యువన్‌శంకర్‌రాజాతో స్వీట్‌హార్ట్ చిత్ర యూనిట్