హెచ్‌డీ ఎఫ్‌సీ ఎర్గొ ఇన్సూరన్స్ అవేర్ నెస్ అవార్డుల జూనియర్ గ్రాండ్ ఫినాలే క్విజ్ పోటీలు తమిళనాడు,పుదుచ్చేరిలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించారు. ఈ క్విజ్‌లో 42 ప్రాంతాలలోని తమిళ మీడియం ప్రభుత్వ పాఠశాలల నుంచి 530కు పైగా జట్లు పాల్గొన్నాయి. ఇందులో క్విజ్ విజేతలకు రూ.1.50 లక్షలు చెక్కును చీఫ్ ఆపరేటింగ్ డైరెక్టర్ అంకుర్ బహోరే సోమవారం అందజేశారు. అలాగే రన్నరప్ వరుసగా రూ. 90 వేలు రూ. 60 వేలు అందజేశారు. మరో ఐదుజట్లకు తలారూ. 30 వేలు అందజేశారు. –సాక్షి, చైన్నె
క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు