వేలూరు: టీచర్లు వినూత్న విద్యా బోధన, బోధన పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని వేలూరు జిల్లా విద్యాశాఖ సీఈఓ మణిమొళి అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వినూత్న అభ్యాసం, బోధన పద్ధతులు, పరిశోధన పత్రాల భాగస్వామ్యం కోసం ఉపాధ్యాయులకు సైన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. దీంతో మొట్టమొదటి సారి గా వేలూరులోని ఊరీస్ కళాశాలలో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువళ్లూరు, కాంచిపురం జిల్లాలకు చెందిన 120 మంది టీచర్లకు శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమైంది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల విద్య నుంచే సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పరిశోధన నివేదికలు సమర్పించే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నా రు. శిక్షణను విడతల వారిగా నిర్వహిస్తామని ఇక్క డ శిక్షణ పొందిన వారు మీ ప్రాంతంలోని టీచర్లకు జోన్ల వారిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జ్యోతీశ్వర పిళ్లై, తమిళనాడు సైన్స్ మూవ్‌మెంట్ జిల్లా కార్యదర్శి డాక్టర్ జనార్దన్, జిల్లా అధ్యక్షులు అముద, మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్రమ ణి, నార్త్‌జోన్ కో–ఆర్డినేటర్ అంబిక పాల్గొన్నారు.