తిరువల్లూరు: నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై న వారు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ఇటీవల గ్రూప్–4 పరీక్షలను నిర్వహించి మూడు నెలల క్రితం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో విజయం సాధించిన వారికి ఇటీవల జిల్లాలకు నూతన ఉద్యోగులను కేటాయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాకు 20 మందిని కేటాయించగా వారు గ్రామీణభివృద్ధి శాఖ లో అసిస్టెంట్లుగా విధులను నిర్వహించనున్నా రు. నూతన ఉద్యోగులకు ఇటీవల శిక్షణ సైతం ఇచ్చారు. శిక్షణ పూర్తయిన క్రమంలో నూతన ఉద్యోగులు కలెక్టర్ ప్రతాప్‌ను కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలకు ఎంపికై నవారు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. విధి నిర్వహణలో అవినీతికి దూరంగా వుండాలన్న ఆయన, ఉద్యోగుల పనితీరు ఆదర్శంగా వుండాలని సూచించారు. ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.