కొరుక్కుపేట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ శ్రీ కన్యకాపరమే శ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) విద్యార్థినులు ప్ర త్యేకతను చాటుకుంటున్నారు. ఆటపాటలు, మైమ్ యాక్ట్స్, డ్యాన్స్ వంటి ఆకర్షణీయమైన ప్రదర్శనలతో తమ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చైన్నె ఐల్యాండ్ గ్రౌండ్స్ వేదికగా 49వ వాణిజ్య ప్రదర్శన 2025లో ఈనెల 12 నుంచి 14 వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పాల్గొని ప్రత్యేక స్టాల్స్ ద్వారా పలు అంశాలపై అవగాహన పెంచుతున్నారు. ఈ ఫెయిర్‌లో టీటీడీసీ డిప్యూటీ సెక్రటరీ వీరు సామి, టిటిడిసి అదనపు డైరెక్టర్ టీఎంటీ ఉమా శంకర్, విద్యాశాఖ అనుసంధాన అధికారులు డాక్టర్ జె. సులైమాన్, డాక్టర్ డబ్ల్యూ శాంతి, డాక్టర్ ఎస్. సెంథిల్ ఎస్‌కేపీసీ స్టాల్స్‌ను సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ వూటుకూరు శరత్ కుమార్ ప్రభుత్వ అధికారులకు స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ ఇన్‌చార్జ్ డాక్టర్. పి. బి. వనీత, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. వి. నప్పిన్నై, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డా. పి. భరణి కుమారి, డాక్టర్ పి ఎస్ మైథిలి పాల్గొన్నారు.