వేలూరు: జిల్లాలోని కాట్పాడి సమీపంలో ఉన్న వంజూరుకు చెందిన అరుణ్ అనే ఫైనాన్సియర్‌పై హ త్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు వి చారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వేలూ రు జిల్లా కాట్పాడి సమీపంలోని గాంధీనగర్‌లో వంజూరుకు చెందిన అరుణ్ అనే వ్యక్తి ఫైనాన్స్ కా ర్యాలయం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి కా ట్పాడి వీజీరావ్ నగర్‌కు చెందిన జాన్‌సన్ ఫైనాన్సియర్ అరుణ్‌తో కార్యాలయంలో కలిసి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. జాన్‌సన్ తోసి వేయడంతో అరుణ్ కింద పడి స్పృహతప్పాడు. ఆ సమయంలో అరుణ్ కడుపులో కమ్మీ గుచ్చుకుని రక్తపు మడుగులో పడి ఉండడంతో అతన్ని వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి జాన్‌సన్ తరలించాడు. ఆస్పత్రిలో అరుణ్‌కు చికిత్స చేస్తున్న సమయంలో అతని కడుపులో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే విరుదంబట్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అదనపు ఎస్పీ భా స్కరన్, డీఎస్పీ పయణి, పోలీసులు ఫైనాన్స్ దుకాణం వద్దకు చేరుకుని విచారణ జరపడంతోపాటు వేలి ముద్రలను సేకరించారు. జాన్‌సన్‌ను విచారణ చేస్తున్నారు.