ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది... | - | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది...

Oct 3 2023 12:46 AM | Updated on Oct 3 2023 8:30 AM

- - Sakshi

ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది. ఆమెను అతి కిరాతకంగా ప్రేమోన్మాది నరికి చంపేశాడు.

సాక్షి, చైన్నె : ప్రేమోన్మాదానికి మరో అబల సంధ్య బలైంది. ఆమెను అతి కిరాతకంగా ప్రేమోన్మాది నరికి చంపేశాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన తిరునల్వేలిలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా తిరుపతి కరసల్‌ప్రాంతానికి చెందిన మారి ముత్తు మూడో కుమార్తె సంధ్య. ఈమె తిరునల్వేలి టౌన్‌ కీళ రథం వీధిలోని ఓ ఫ్యాన్సీ షోరూమ్‌లో పనిచేస్తోంది. మధ్యాహ్నం అమ్మన్‌ వీధిలోని గోడౌన్‌కు కొన్నిఫ్యాన్సీ సామాన్లు తెచ్చేందుకు వెళ్లిన సంధ్య ఎంతకు రాలేదు. దీంతో ఆ షోరూమ్‌లో ఉన్న ఇతర సిబ్బంది గోడౌన్‌కు వెళ్లి చూశారు.

అక్కడ ఆమె రక్తపు ముడుగులో పడి ఉండటంతో ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరీక్షించగా ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది. సంధ్యను తరచూ ఓ యువకుడు వెంబడించే వాడని, ప్రేమ పేరిట వేధించే వాడని విచారణలో తేలింది.

కొంతకాలం వీరు చెట్టాపట్టలు వేసుకుని తిరిగి తర్వాత కొద్దిరోజులకు ఆమె దూరం పెట్టడంతో అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు వెలుగు చూసింది. దీంతో ఆ ప్రేమోన్మాది ఎవరో అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సంధ్య మృత దేహాన్ని పాళయంకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంగా ప్రేమోన్మాదుల చేతిలో యువతులు బలి అవుతున్న సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతోండడం ఆందోళనకరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement