తిరువళ్లూరు: మద్యం తాగొద్దని పిల్లలు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా మురుగుచ్చేరి గ్రామానికి చెందిన ఆదియాన్(85). ఇతను తరచూ మద్యం తాగి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయంపై 20వ తేదీన ఇంట్లో గొడవ చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన వృద్ధుడు పెయింట్ తిన్నర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.