
అధికారులతో మాట్లాడుతూ..
ప్రతివారం ప్రగతి నివేదిక..
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనాకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు పనులు, రోడ్ల పరిస్థితి తదితర అంశాల గురించి వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించి నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే చైన్నె మెట్రో రైలు పనులు పనులు సజావుగా సాగేడంతో పాటు పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శివార్లలోని పెరుంగుడి మండలం పరిధిలోని ప్రాంతాలలో, వేళచ్చేరి పరిసరాల్లో పర్యటించారు. డ్రైనేజీ, వర్షపు నీటి కాలువల నిర్మాణాలను, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. తిరువళ్లూరు హైవే డివిజన్, అంబత్తూరు సబ్ డివిజన్, పూందమల్లి హైవే డివిజన్ పరిఽధిలోని వలసరవాక్కం – రామాపురం మార్గం, కోడంబాక్కం హైరోడ్డు మార్గం – శ్రీపెరంబదూరు, పూందమల్లి – ఆవడి రహదారుల పనులను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు. కలైంజ్ఞర్ కరుణానిధి నగర్, అశోక్ నగర్, ఆళ్వార్ తిరునగర్, వలసరవాక్కం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మెట్రో రైలు పనులు చేపట్టాలని, పనుల వేగం పెంచాలని సూచించారు.
● పెరుగుండి, వేళచ్చేరిలో పర్యటన
● కాలువ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
● రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల స్థితిగతులపై నివేదికకు ఆదేశాలు
సాక్షి, చైన్నె: రెండు రోజుల క్రితం సచివాలయంలో జరిగిన సమీక్ష సందర్భంగా చైన్నె నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితిపై సీఎం స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తానే స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రికి రాత్రే అనేక మార్గాలలో అధికారులు ఆగమేఘాలపై రోడ్ల పునరుద్ధరణ, కొత్త నిర్మాణాలపై దృష్టి పెట్టారు. ఈనేపథ్యంలో గురువారం మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ పరిధిలోని రామ్ నగర్ 7వ క్రాస్ వీధి, 3వ మెయిన్ రోడ్డు వెస్ట్, రామన్ నగర్ 3వ మెయిన్ రోడ్డులో రూ. 85 లక్షలతో చేపడుతున్న రోడ్డు పనులను సీఎం స్టాలిన్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రహదారుల విభాగం నేతృత్వంలో రూ. 4.5 కోట్లతో మనపాక్కం – కొలప్పక్కం రోడ్డు, మరో రూ. 2.23 కోట్లతో పూర్తి చేసిన రామాపురం – తిరువళ్లూర్ రోడ్డు పనులను తనిఖీ చేశారు.
సమన్వయంతో ముందుకు..
ఈశాన్య రుతుపవనాల సీజన్ నాటికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, హైవే విభాగం, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ బోర్డు, నీటి సరఫరా బోర్డు, టెలికమ్యూనికేషన్ శాఖ, చైన్నె మెట్రో రైల్ అధికారులతో సమన్వయంతో పనిచేసి అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు కోరారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు నెహ్రూ, అన్భరసన్, ఎం. సుబ్రమణియన్, సీఎస్ శివదాస్ మీనా, మెట్రో రైల్ ఎండీ సిద్ధిక్ తదితర అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మెట్రో పనులు, రోడ్డు పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో మెట్రో పనులు చేపట్టాలని ఆదేశించారు.