
ముస్తఫా ముస్తఫా చిత్రంలో సతీష్, మౌనిక చిన్నకోట్ల
తమిళసినిమా: స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను ఎప్పుడు కోల్పోలేదనే చెప్పారు. ఇందుకు ఈ మధ్య వచ్చిన కన్నుమ్ కన్నుమ్ కొల్‌లైయడిత్తాల్, సూదు కవ్వుమ్ వంటి చిత్రాలే ఓ ఉదాహరణ. కాగా ఆ తరహాలో తాజాగా రూపొందుతున్న చిత్రం ముస్తఫా ముస్తఫా. ది మాపోగోస్ పతాకంపై ప్రదీప్ మహదేవన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. సతీష్ సురేష్ రవి హీరోలుగా నటిస్తున్న ఇందులో నటి మౌనిక చిన్న కోట్ల, మానస చౌదరి హీరోయిన్లుగానూ, నటుడు కరుణాకరన్, పుగళ్, పావెల్ నవగీతం, ఐశ్వర్యా దత్తా, వీజే మహేశ్వరి, వీజే పార్వతి, లివింగ్టన చామ్స్, దీప్స్, ఉమా పద్మనాబన్, వినోద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ ఇది స్నేహం నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో సతీష్‌కు జంటగా మౌనిక చిన్న కోట్ల, సురేష్‌రెడ్డికి జంటగా మానస చౌదరి నటిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలలో నిర్మించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.