
నిందితుడు (ఫైల్)
తిరువళ్లూరు: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన యువకుడికి 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.28 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా మహిళా కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కున్నవలం గ్రామానికి చెందిన బాల (23). ఇతనికి అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతితో చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని యువతిని 2020 ఫిబ్రవరి 25న ఆంధ్రప్రదేష్ రాష్ట్రం నగరికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. అనంతరం యువతిని అక్కడే వదిలిపెట్టి ఇంటికి వచ్చేశాడు. యువతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కనకమ్మసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మరుసటి రోజు బస్సు ద్వారా ఇంటికి చేరిన యువతి తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అప్పట్లో బాలను అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ తిరువళ్లూరు మహిళా కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన నేపథ్యంలో యువకుడు మైనర్ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు నిర్ధారణ కావడంతో మహిళా కోర్టు న్యాయమూర్తి సుభద్రాదేవి గురువారం తీర్పును వెలువరించారు.