
తల్లిదండ్రులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్
వేలూరు: తిరుపత్తూరు జిల్లా మాడపల్లిలోని అన్నానగర్ ప్రాంతంలో పిల్లలను పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే బంధించినట్లు కలెక్టర్ భాస్కర్‌పాండియన్‌కు సమాచారం అందింది. దీంతో కలెక్టర్ నేరుగా వెళ్లి విచారణ చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ మద్యంతో పాటు మత్తు పదార్థాలకు బానిస కావడంతో పిల్లలకు ఆహారం కూడా పెట్టకుండా ఇంట్లోనే ఉంచుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరు పిల్లలను కలెక్టర్ కారులో ఎక్కించుకుని సమీపంలోని ప్రభుత్వ హాస్టల్‌లో వదిలి పెట్టి వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం తల్లిదండ్రులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దేవదాయశాఖ కమిషనర్ భాను, అధికారులు పాల్గొన్నారు.