
యాగ పూజల్లో భక్తులు
వేలూరు: వాలాజలోని ధన్వంతరి ఆరోగ్యపీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వారహీ పంచమి, షష్టి వైభవం నేత్రపర్వంగా జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కాళీ, సూలిని, త్రిపుర భైరవి, పాగలముఖి, వారహీ వంటి ఐదు ముఖాలతో పది చేతులు, ఐదు ముఖాలు, నాలుగు అడుగుల ఎత్తు గోలంలో కూర్చొని పది ఆయుధాలతో విరాజిల్లుతున్న పంచముఖి వారహీ అమ్మవారిని ప్రతిష్టించారు. ఈ అమ్మవారికి పూజలు చేసి దీపారాధనలు చేయడం ద్వారా దోషం తొలగి వివాహం జరుగుతుంది, సంతాన భాగ్యం, సంపదలు పెరగడం, వ్యాధుల నుంచి విముక్తి, దోషాలు తొలగి, ప్రమాదాల నుంచి బయటపడడం వంటివి జరుగుతాయని నమ్మకం. దీంతో బుధవారం ఉదయం వేద పండితులచే ప్రత్యేక వేద మంత్రాలు చదివి అమ్మవారికి వారహీ హోమం, అభిషేకం, పుష్పాలంకరణ, దీపారాధన పూజలు నిర్వహించారు.