
కొరుక్కుపేట: వినాయకుడిని కీర్తిస్తూ సంగీత గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్ బృందం ఆలపించిన భక్తి సంగీత విభావరి అలరించింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా చైన్నె సాలిగ్రామంలోని శ్రీ కావేరి వినాయక దేవాలయంలో సంగీత ఉత్సవాలు ఏర్పాటు చేశారు. శ్రీ స్వర క్రియేషన్‌న్స్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్, సౌమ్యశ్రీ విశిష్ట, వినీషా విశిష్ట కలసి వినాయకుడిపై కీర్తనలు పాడి శ్రోతలను మైమరిపింపజేశారు. దేవాలయ నిర్వాహకులు గాయకులను ఘనంగా సత్కరించారు.