పోలీసులకు వాట్సాప్‌ గ్రూప్‌ | Sakshi
Sakshi News home page

పోలీసులకు వాట్సాప్‌ గ్రూప్‌

Published Wed, Aug 23 2023 12:40 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: పోలీసులకు ఉపయోగకరంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుకు డీజీపీ శంకర్‌ జివ్వాల్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో తమిళనాడు పోలీసు సంక్షేమం పేరిట ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీజీపీ, ఏడీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, కమిషనర్ల స్థాయి అధికారులు ఉంటారు. అలాగే నగరస్థాయిలో అదనపు కమిషనర్ల నేతృత్వంలో డీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులతో గ్రూప్‌లను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే డీసీపీ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు, అదనపు ఇన్‌స్పెక్టర్లు ఎస్‌ఐలు, తమ పరిధిలోని పోలీసులు ఈ గ్రూప్‌లో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎస్పీ, డీఎస్పీల నేతృత్వంలో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేయడానికి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని డీజీపీ నుంచి ఆయా అధికారులు, ఆ తదుపరి స్థాయిల్లో ఉన్నవారికి చేర వేస్తారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement