తిరువొత్తియూరు: తిరుచ్చి విమానాశ్రయంలో సింగపూర్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.38.78 లక్షల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం గురువారం వచ్చింది. ఇందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వున్న ఒక ప్రయాణికుడిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేయగా అతని లోదుస్తులలో 180 గ్రాముల బంగారంన, కారు విడిభాగంలో 450 గ్రాముల మొత్తం రూ.38 విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతని వద్ద విచారిస్తున్నారు.