
పెళ్లి దుస్తులతో పరీక్ష రాస్తున్న కుముద
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు ప్రాంతానికి చెందిన సంధ్య. ఈమె ఆర్కాడు మహాలక్ష్మి ఆర్ట్స్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది. ఈమెకు శుక్రవారం ఉదయం వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే పెళ్లి దుస్తులతో భర్తతో కలిసి వెళ్లి పరీక్ష రాసింది. దీంతో ఆమెకు టీచర్‌లు, సహచర విద్యార్థులు అభినందనలు తెలిపారు. అదే విధంగా తిరువణ్ణామలై జిల్లాలో భూద మంగళం గ్రామానికి చెందిన కుముద తిరువణ్ణామలైలోని కలైంజర్ కరుణానిధి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది. ఈమెకు శుక్రవారం అదే కళాశాలలో పరీక్షలు నిర్వహించడంతో ఈమెకు శుక్రవారం ఉదయం వివాహం పూర్తి చేసుకుని పెళ్లి బట్టలతో పరీక్షలకు హాజరైంది. పెళ్లికూతురిని టీచర్‌లు, సహ విద్యార్థులు అభినందించారు.