
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి దురైమురుగన్
వేలూరు: కర్ణాటక ప్రభుత్వం మేఘధాతు నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతి ఇవ్వదని డీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో తాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అధ్యక్షతన జరిగింది. వేలూరు కార్పొరేషన్‌లో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తాగునీటిని సరఫరా చేయాలని పరిశుభ్రమైన నీటిని సరఫరాచేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కమిషనర్ అధ్యక్షతన కార్పొరేషన్ అధికారులతో సమీక్షించి స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. పార్లమెంట్ సభ్యులు కదిర్‌ఆనంద్, ఎమ్మెల్యే నందకుమార్, కమిషనర్ రత్నస్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి మేఘదాతు డ్యామ్ నిర్మిస్తామని తెలపడం సరికాదని మేఘదాతు గురించి శివకుమార్‌కు ఏమీ తెలియదన్నారు. తాను 30 సంవత్సరాలుగా కావేరి సమస్యపై పోరాడుతున్నానని తనకు వీటిపై పూర్తి విషయాలు తెలుసునన్నారు. కావేరి నుంచి తమిళనాడుకు ఎంత నీరు ఇవ్వాలనే విషయంపై కావేరి ట్రిబ్యునల్‌లో గాని, సుప్రీంకోర్టులో గాని ఈ అంశం లేవనెత్తడం లేదన్నారు.
మంత్రి దురైమురుగన్