
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు తాలుకా లోని రత్నగిరి బాలమురుగన్ ఆలయంలో వైకా శి విసాకాన్ని ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవ కోలాహలంగా సాగింది. ముందుగా ఉదయం రథానికి ఆలయ స్వామిజీ బాలమురుగన్ అడిగల్ స్వామీజి, కలవై సచ్చిదానం స్వామీజీలచే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంకరించిన రథం వద్దకు బాలమురుగన్‌ను ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆశీనులు చేశారు. అనంతరం పీఠాధిపతులు, ఎమ్మెల్యే ఈశ్వరప్పన్ రథం దారానికి పూజలు చేశారు. అనంతరం భక్తులు హరోహరా నామస్మరణాల నడుమ భక్తులు రథాన్ని లాగారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రథం కొండ చుట్టుకుని ఆలయానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకుంది. రథోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై మిర్యాలు, బొరుగులు చల్లి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులతో పాటు పారిశ్రామిక వేత్తలు భక్తులకు అన్నదానం, మజ్జిగ, తాగునీరు అందజేశారు.