
ఎస్టీలతో పంచాయతీ అధ్యక్షుడు రమేష్
తిరువళ్లూరు: ప్రయివేటు వ్యక్తి చేతిలో వున్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారుల సాయంతో స్వాధీనం చేసుకుని ఎస్టీలు ఇళ్లు నిర్మించుకోవడానికి పంచాయతీ అధ్యక్షుడు రమేష్ అంగీకరించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామంలో ప్రభుత్వానికి చెందిన సుమారు 52 సెంట్ల ప్రభుత్వ భూమి వుంది. దీన్ని ప్రయివేటు వ్యక్తి ఆక్రమించుకున్నాడు. దాన్ని అప్పగించాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో పంచాయతీ అధ్యక్షుడు రమేష్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు సంబంధిత భూమిని సర్వే చేసి ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. గురువారం ఉదయం జేసీబీతో 52 సెంట్ల భూమిలో వున్న మామిడి చెట్లను తొలగించారు. అనంతరం సంబంధిత భూమిలో 13 ఎస్టీ కుటుంబాలు నివాసం వుండడంతో పాటు ఇటీవల మంజూరైన ఇళ్ళను నిర్మించుకోవడానికి అనుమతించారు. కాగా ఏళ్ళ తరబడి పట్టా, పక్కా గృహాల నిర్మాణం కోసం పోరాడిన ఎస్టీల కలను సాకారం చేసిన పంచాయతీ అధ్యక్షుడు రమేష్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.