
ఒప్పందం చేసుకుంటున్న ఆయా సంస్థల నిర్వాహకులు
కొరుక్కుపేట: చైన్నెకు చెందిన రేనాటస్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకుఅరుదైన అవకాశం దక్కింది. మాల్దీవుల్లోని గేన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విస్తరణ, అభివృద్ధి పనుల కాంట్రాక్టును రేనాటస్‌కు లభించిన సందర్భంగా నగరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ఆడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జియాస్ నజీర్, రేనాటస్ సంస్థ చైర్మన్ సెల్వ సుందరం పోసప్పన్ కలసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా సెల్వ సుందరం మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందం కుదరడం తమ సంస్థకు గర్వకారణం అన్నారు.