ఏబీవీపీ జిల్లా కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ జిల్లా కమిటీ ఎన్నిక

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో ఆదివారం ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు రంగు ముత్యంరాజు అధ్యక్షతన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జెరిపోతుల లక్ష్మణ్‌, కార్యదర్శిగా మాశెట్టి నరేష్‌, కోశాధికారిగా జగదీష్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా రాచకొండ శ్రీనివాస్‌, కొత్తగట్టు యాదగిరి, సహాయ కార్యదర్శి అక్కల నరేష్‌, ఈశ్వర్‌, పీఆర్‌ఓగా చౌదరి రెడ్డి, కమాండెంట్‌గా పులుసు ఎల్లేష్‌తోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు గురునాధన్‌, జనగామ తిరుపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్‌, జిల్లా అధ్యక్షుడు రంగు ముత్యంరాజు, కార్యదర్శి యాదగిరి, కోశాధికారి నరేష్‌, సుంకాని శ్రీనివాస్‌, కమాండెంట్‌ పులుసు ఎల్లేష్‌, సభ్యులు పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనారసింహుడికి విశేష పూజలు

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం జరిపించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

ఆత్మకూర్‌(ఎస్‌) : మండలం కేంద్రంలోని నెమ్మికల్‌ గ్రామంలో ఉన్న పూలే – అంబేద్కర్‌ గ్రంథాలయంలో టీ–సాట్‌ ద్వారా నిర్వహించే ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు ఆదివారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత ఉచిత ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయానికి టీవీని బహూకరించిన దాత శీలం వేణును సన్మానించారు. అదేవిధంగా మనం ఫౌండేషన్‌ ద్వారా గ్రంథాలయాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఫౌండేషన్‌ అధ్యక్షుడు గంపల కృపాకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్తులు గంపల నారాయణ, గరిగంటి ప్రకాష్‌, శీలం వేణు, శంకర్‌, పూర్ణేష్‌, సునీల్‌, సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం మద్దతు ధర చట్టం చేయాలి

హుజూర్‌నగర్‌ : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని అమరవీరుల భవన్‌లో పట్టణ నాలుగో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలని కోరారు. ఆమేరకు కేంద్రం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా పూర్తిగా అందించాలని, రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని, బోనస్‌ కూడా అందించాలని కోరారు. రెవెన్యూ పరిధిలో ఉన్న రైతుల సమస్యలను భూభారతిలో సులభతరంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో నాయకులు వీరబాబు, లక్ష్మమ్మ, సైదులు, హుస్సేన్‌, శీలం శ్రీను, మురళి, వీరయ్య, నాగేశ్వరరావు, వెంకన్న, లింగమ్మ, వెంకటేశ్వర్లు, వీరమల్లు, వీరస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement