వడగళ్లు కాదు.. దూది పూలు | - | Sakshi
Sakshi News home page

వడగళ్లు కాదు.. దూది పూలు

Mar 24 2026 6:53 AM | Updated on Mar 24 2026 6:53 AM

పెద్దవూర : పై ఫోటోను చూసి వేసవిలో రాళ్ల వర్షం కురిసిందా.. భూమిపై అంతా మంచు పేరుకుపోయిందా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరబడినట్లే. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన గుంటుక కృష్ణారెడ్డి గత వానాకాలం సీజన్‌లో తన చేనులో పత్తిని ఏరించాలనుకునే సమయానికి నవంబర్‌లో వరుసగా వర్షాలు కురిశాయి. దీంతో పత్తి చాలా వరకు రాలిపోయింది. వర్షాలు తగ్గాక పత్తి ఏరడానికి కూలీల కొరత ఏర్పడడంతో నేలపై రాలిపోయిన పత్తిని ఏరలేదు. ఐదు రోజుల క్రితం పత్తి కట్టెను తొలగించటంతో భూమిపై రాలిపోయిన పత్తి అంతా ఇలా తెల్లగా కనిపిస్తోంది. పెద్దవూర మండలంలోని చాలా వరకు పత్తి చేలలో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement