కోదాడ: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కేసు దర్యాప్తు నాలుగు రోజుల్లో పూర్తవుతుందని ప్రత్యేక దర్యాప్తు అధికారి రవి తెలిపారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన మృతుడి తల్లి కర్ల లలితమ్మను అడిగి వివరాలు సేకరించారు. రాజేష్‌కు పోలీసులు వేసినట్లుగా చెబుతున్న ఇంజెక్షన్‌ను ఆయన స్వాధీనం చేసుకున్నారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
నత్తనడకగా విచారణ : మంద కృష్ణమాదిగ
రాజేష్ మృతి కేసు దర్యాప్తును నత్తనడకన చేస్తున్నారని, బాధ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. సోమవారం రాజేష్ ఇంటికి ప్రత్యేక దర్యాప్తు అధికారి వస్తున్నారని తెలుసుకున్న ఆయన కోదాడకు వచ్చారు. రాజేష్ తల్లి, దర్యాప్తు అధికారితో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉండగా.. అప్పటి డీఎస్పీ, ప్రస్తుత డీఎస్పీ, జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తికాకపోతే ఉద్యమిస్తామన్నారు. ఆయన వెంట ఏపూరి రాజు, నాగరాజు తదితరులు ఉన్నారు.
కర్ల రాజేష్ మృతి కేసు
ప్రత్యేక దర్యాప్తు అధికారి రవి


