ఈసారి వారోత్సవాలు లేనట్టేనా?
చిలుకూరు: ఎంతో చర్రిత కలిగిన చిలుకూరు బాపూజీ శాఖా గ్రంథాలయంలో ఈ ఏడాది కూడా వారోత్సవాలు లేనట్టే కనిపిస్తోంది. శుక్రవారం నుంచి జరగాల్సిన వారోత్సవాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. గత ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించలేదు. అష్టాంధ్రమహాసభకు చిలుకూరు గ్రంథాలయం వేదికగా నిల్చింది. రెండేళ్ల క్రితమే నూతన భవనం నిర్మించారు. ఒకప్పుడు గ్రంథాలయ వారోత్సవాలు వచ్చాయంటే చిలుకూరులో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదయం, సాయంత్ర వేళలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రముఖలతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ఇచ్చేవారు. అలాంటి గ్రంథాయలం నేడు ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోవడం లేదు. ఈ గ్రంథాలయానికి ప్రస్తుతం ఇన్‌చార్జి గ్రంథాలయ అధికారి ఉన్నారు. ఒక అటెండర్ ఉన్నారు. ఇప్పటికై నా ఈ గ్రంథాలయానికి పూర్వవైభం తేవాలని పాఠకులు కోరుతున్నారు.
ఫ రెండేళ్లుగా వారోత్సవాలకు నోచని చిలుకూరు గ్రంథాలయం


