42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చలమళ్ల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రాజా, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్‌లో నిర్వహించిన బీసీల ధర్మ పోరాట దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చేవరకు పార్టీలకతీతంగా బీసీ కులసంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకుడు మట్టపల్లి సైదులు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నిద్ర సంపత్ నాయుడు, బండపల్లి శ్రీనివాస్ గౌడ్, బండారి డేవిడ్ కుమార్, డాక్టర్ బంటు కృష్ణ, భయ్యా మల్లికార్జున్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, నారా బోయిన వెంకట్ యాదవ్, రేణి కుంట్ల నరేందర్, కందాల భాస్కర్, జెల్లీ సత్యనారాయణ, సలిగంటి నాగయ్య, గిలకత్తుల నాగమణి, అమరవాది శ్రావణి, ఆకుల లవకుశ, నేరెళ్ల మధు, కోడి లింగ యాదవ్, కోడిదల రాంబాబు, దాసరి దేవయ్య, కొండగడపల సూరయ్య పాల్గొన్నారు.
ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న బీసీ జేఏసీ, ఇతర సంఘాల నాయకులు


