
ప్రజలకు మాజీ మంత్రి దీపావళి శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : చీకటిని పారదోలే వెలుగుల పండుగ దీపావళి అని, దీపాల కాంతులవలె తెలంగా ణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించాలన్నారు.
పండుగను సంతోషంగా జరుపుకోవాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : దీపావళిని పురస్కరించుకొని బాణసంచా, టపాసులు పేల్చే సమయంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల పేరుతో ఇతరులను ఇబ్బందులకు గురిచేయొద్దని, మహిళలను గౌరవించాలని పేర్కొన్నారు. బాణాసంచా తయారీదారులు, విక్రయదారులపై నిఘా ఉంచామని తెలిపారు.
పోరాట యోధుడు ధర్మభిక్షం
సూర్యాపేట అర్బన్ : గీత కార్మికుల సంక్షేమ కోసం అహర్నిశలు పోరాడిన యోధుడు ధర్మభిక్షం అని గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొండ కోటయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం 68వ వార్షికోత్సవానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా గీత పని వారల సంఘం వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ, దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మభిక్షం వర్ధంతి, జయంతిని అధికారంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో దోరపల్లి శంకర్, పాలకూరి బాబు, బండారు లక్ష్మయ్య, పాలకూరి బాబు, దోరపల్లి శంకర్, బూర వెంకటేశ్వర్లు, బూర సైదులు, పెద్దపోలు విష్ణు, ఎడెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సమైక్యతకు ఆర్‌ఎస్‌ఎస్ కృషి
తుంగతుర్తి : దేశ సమైక్యతకు ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో కృషిచేస్తోందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివా రం తుంగతుర్తిలో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడారు. ముందుగా స్థానిక మెయిన్ రోడ్డుపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు మాజీ మంత్రి దీపావళి శుభాకాంక్షలు

ప్రజలకు మాజీ మంత్రి దీపావళి శుభాకాంక్షలు