
‘ఆబ్కారీ’ ఆదాయం పెరిగేనా..!
సూర్యాపేటటౌన్ : జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచింది. సెప్టెంబర్ 26నుంచి ఈనెల 18వ తేదీ రాత్రి వరకు మద్యం టెండర్లు స్వీకరించారు. అయితే చివరి రోజు (18వ తేదీన) జరిగిన బీసీ బంద్ నేపథ్యంలో టెండర్లు వేసేందుకు అంతరాయం కలిగింది. దీంతో కొందరు వ్యాపారుల విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు టెండర్ల గడువు పొడిగించింది. అలాగే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు సైతం రాకపోవడంతో గడువు పెంచినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం గడువు పెంచినా దరఖాస్తులతోపాటు ఆబ్కారీ శాఖకు ఆదాయం పెరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 2,617 దరఖాస్తులు..
జిల్లాలో 93 వైన్స్‌లకు 23 రోజుల వ్యవధిలో అతికష్టం మీద 2,617 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదికూడా చివరి రోజు ఈ నెల 18న 1,343 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 11గంటల తర్వాత ప్రభుత్వం దరఖాస్తు గడువు పెంచింది. అయితే 18వ తేదీ వరకు జిల్లాలోని 93 వైన్స్‌లకు 2,716 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సూర్యాపేట సర్కిల్‌లో 31 వైన్స్‌లకు గాను 846, తుంగతుర్తి సర్కిల్‌లో 17 వైన్స్‌లకు గాను 368 దరఖాస్తులు, కోదాడ సర్కిల్‌లో 21 వైన్స్‌లకు గాను 633 దరఖాస్తులు, హుజుర్‌నగర్ సర్కిల్‌లో 24 వైన్స్‌లకు గాను 770 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో చిలుకూరు మండలం బేతవోలు వైన్స్‌కు అత్యధికంగా 57 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ ఫీజు ద్వారా రూ.78.51కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతేడాది 4,338 దరఖాస్తులు రాగా రూ.86.76కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈ నెల 27న డ్రా పద్ధతిన వైన్స్‌లు కేటాయించనున్నారు.
గత సీజన్‌లోనే పోటీ తీవ్రం
గత సీజన్‌లో మద్యం దుకాణాల కోసం పోటీ తీ వ్రంగా ఉంది. ఒక్కో షాపునకు 50కి పైగా టెండర్లు వేశారు. కానీ ఈ సారి ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఈ సారి టెండర్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. మూడ్రోజుల గడువులోగా ఎన్ని దరఖాస్తులు వస్తాయో వేసిచూడాలి.
ఫ 23వ తేదీ వరకు మద్యం
టెండర్ల గడువు పెంచిన ప్రభుత్వం
ఫ ఇప్పటి వరకు 2,617 దరఖాస్తులు
ఫ టెండర్ ఫీజు అదనంగా రూ.లక్ష పెంపుతో ఆసక్తిచూపని వ్యాపారులు
ఫ గతంలో మాదిరిగా కనిపించని ఉత్సాహం