
ఏపీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి చేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యను మానుకోవాలి. అవినీతి, అరాచకాలను వెలికి తీసి వార్తలు రాస్తుందనే నెపంతో సాక్షి పత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.
– మద్దెల జ్యోతి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి
ఫ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం నిరంకుశత్వం
ఫ ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీరు
మార్చుకోవాలంటున్న ప్రజా సంఘాల నాయకులు
భానుపురి (సూర్యాపేట) : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పత్రికలపై వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే చేటులా ఉంది. ప్రశ్నించే వ్యక్తులు, సంస్థలు, పత్రికలపై కక్షకట్టడం ఏ మాత్రం సహించరానిది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాక్షి దినపత్రిక అవినీతి, అక్రమాలపై నిక్కచ్చిగా వార్తలు ప్రచురిస్తోంది. అలాంటి సాక్షి మీడియాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి నుంచి పక్షపాతంగా వ్యవహరిస్తూ దాడులు చేయించడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరించాలని చూడడం అప్రజాస్వామికమని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.

ఏపీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి చేటు