
పాఠశాలల తనిఖీకి ప్రత్యేక బృందాలు
అర్హులను నియమిస్తాం
అర్హతలు ఏమిటంటే..
చిలుకూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా సబ్జెక్టు నిపుణులతో 11 టీములను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో టీముల్లో సభ్యులను నియమిస్తారు. త్వరలో ఈ బృందాలు తనిఖీలు చేపడతాయి.
బృందాలలో సభ్యుల నియామకం ఇలా..
జిల్లాలో 600 ప్రాథమిక పాఠశాలల తనిఖీకి ఆరు బృందాలు, 76 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక బృందం, 180 ఉన్నత పాఠశాలల తనిఖీకి నాలుగు టీములను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేయడానికి జిల్లా స్థాయిలో ముగ్గురితో ఒక బృందం ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీకి ముగ్గురితో బృందాన్ని నియమిస్తారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకరు, ఒక ఎస్‌జీటీ సభ్యులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలల తనిఖీకి తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. జీహెచ్‌ఎం నోడల్ అధికారిగా ఉంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఏడుగురు ఉపాధ్యాయులు బృందంలో ఉంటారు. వీరితో పాటు పీడీ కూడా ఉంటారు. మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు.
పాఠశాలల తనిఖీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. ఈ టీమ్‌లలో సభ్యులను అర్హులను కలెక్టర్ నాయకత్వంలోని కమిటీ ఏర్పాటు చేస్తుంది. త్వరలో ఈ బృందాలు పాఠశాలలను తనిఖీ చేస్తాయి.
–అశోక్, జిల్లా విద్యాధికారి
ఫ సబ్జెక్టు నిపుణులతో 11 టీములు ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఫ రెండు, మూడు రోజుల్లో సభ్యుల ఎంపిక
ఫ త్వరలో 850 బడుల్లో తనిఖీలు
తనిఖీ బృందంలో సభ్యులుగా నియమించాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలి. పదేళ్ల బోధనానుభవం ఉండాలి. సంబంధిత సజెక్టులో పాఠ్యాంశ ప్రదర్శన ఇవ్వగలిగి ఉండాలి. విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యమిస్తారు. చక్కని రాత, మౌఖిక భావవ్యక్తీకరణ నైపుణ్యాలతో పాటు కంప్యూటర్ , డిజిటల్ అక్షరాస్యతలో ప్రతిభాశాలి అయి ఉండాలి. కలెక్టర్ నాయకత్వంలోని కమిటీ ఈ తనిఖీ బృందాలను నియమించేందుకు తుది నిర్ణయం తీసుకుంటుంది. అదనపు కలెక్టర్ , డీఈఓ, మరో జిల్లా స్థాయి అధికారి ఈ కమిటీలో ఉంటారు.

పాఠశాలల తనిఖీకి ప్రత్యేక బృందాలు