
93 షాపులకు 38 దరఖాస్తులే..
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 93 మద్యం షాపులకు ఇప్పటి వరకు వచ్చింది 38 దరఖాస్తులే.. దీనిని బట్టి వైన్స్ షాపుల టెండర్ ప్రక్రియ ఎంత మందకొడిగా సాగుతుందో తెలిసి పోతుంది. రెండేళ్ల పాటు మద్యం షాపుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానిస్తూ సెప్టెంబర్ 26న ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వచ్చి 14 రోజులు అవుతున్నా దరఖాస్తు దారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ నెల 18వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి తొమ్మిది రోజుల్లోనే దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
వచ్చింది 38 దరఖాస్తులే
జిల్లాలో 93 వైన్స్ షాపులు ఉన్నాయి. వాటిని రెండేళ్ల పాటు నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి ఎకై ్సజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను కలెక్టరేట్‌లో సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే టెండరు దారులు రూ. 3లక్షల డిపాజిట్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో గురువారం నాటికి 38 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా 4,338 దరఖాస్తులు వచ్చాయి.
డిపాజిట్ పెరగడంతో వెనుకంజ
గతంలో మద్యం టెండర్ల దరఖాస్తుకు రూ. 2 లక్షల డిపాజిట్ ఉండేది. ఈ సారి దానిని రూ. 3 లక్షలకు పెంచారు. ఈ డిపాజిట్ నాట్ రిఫండబుల్‌గా ఉండడంతో దరఖాస్తు దారులు కాస్త సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపునకు దరఖాస్తు చేసేందుకు రూ.3 లక్షలు చెల్లించాలి. ఒక వేళ షాపు రాకపోతే సదరు డబ్బులపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అందుకే దరఖాస్తు దారులు కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి టెండర్ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దాంతో దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
చివరి మూడు రోజులే కీలకం
మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు కేవలం 9 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు కూడా వ్యాపారులను మోటివేట్ చేస్తున్నారు. చివరి 3 రోజులు దరఖాస్తులు సమర్పించేందుకు మంచి రోజులు ఉన్నాయని, ఆ రోజుల్లో దరఖాస్తు చేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. వాస్తవంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తే డిపాజిట్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ డిపాజిట్ ఏకంగా రూ. 3లక్షలకు పెంచడంతో చాలా మంది ఆలోచనలో పడ్డట్లు తెలిసింది. వాస్తవానికి వైన్స్ షాపులు నడపాలనుకున్న వ్యాపారులు కచ్చితంగా దరఖాస్తు చేసుకుంటారు. కానీ కొందరు లక్కీగా తమకు షాపు దక్కితే కొంత ఎక్కువకు అమ్ముకుందామనే వారు వెనుకడుగు వేస్తున్నారు. ఒక వేళ షాపు రాకపోతే రూ. 3 లక్షలు కోల్పోవాల్సి వస్తుందన్న ధోరణిలో వారు ఆలోచిస్తున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి టెండరు దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే షాపు రాక పోయినా పెద్దగా నష్టం ఉండదన్న భావనలో ఉన్నట్లు తెలిసింది.
మందకొడిగా మద్యం టెండర్లు
నోటిఫికేషన్ వచ్చి 14 రోజులవుతున్నా ముందుకురాని దరఖాస్తుదారులు
పెరిగిన డిపాజిట్‌తో అనాసక్తి
ఇక మిగిలింది తొమ్మిది రోజులే..
దరఖాస్తులు ఇలా..
ఎకై ్సజ్ సర్కిల్ వచ్చిన దరఖాస్తులు
సూర్యాపేట 13
తుంగతుర్తి 11
కోదాడ 11
హుజూర్‌నగర్ 03