
పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి
సూర్యాపేటటౌన్ : పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఫిర్యాదుదారులతో మాట్లాడి పోలీసు సేవలు, సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి పిటీషన్ మేనేజ్‌మెంట్, రిసెప్షన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు మెరుగైన సేవలు అందిస్తేనే పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందన్నారు. సిబ్బంది అందరూ కలిసి టీం వర్క్ చేయాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు ఏడుకొండలు, మహేందరనాథ్, శివతేజ, సురేష్, సిబ్బంది ఉన్నారు.