
రహదారుల నిర్మాణంలో రాజీపడం
గరిడేపల్లి : హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణంలో రాజీపడే ప్రసక్తే లేదని, అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు రూ.17కోట్లతో నిర్మిస్తున్న రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారులు నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు నిర్మాణం జరిగే సమయంలో సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మండలంలోని గానుగబండ నుంచి పరెడ్డిగూడెం వరకు రూ.1.40 కోట్లతో 2 కిలోమీటర్లు, కల్మలచెరువు నుంచి చెవ్వారిగూడెం మీదుగా నేరేడుచర్ల మండలం దిర్శంచర్ల వరకు రూ.3.5కోట్లతో 4.6 కి.మీ, కల్మలచెరువు నుంచి గానుగబండ వరకు రూ.2.8కోట్లతో 6 కి.మీ, కల్మలచెరువు నుంచి పాలకవీడు మండలంలోని సబ్‌స్టేషన్ వరకు రూ.4.2కోట్లతో 6 కిలోమీటర్లు, కల్మలచెరువు నుంచి బొత్తలపాలెం వరకు రూ.3.5కోట్లతో 5 కిలోమీటర్లు, కల్మలచెరువు నుంచి సోమ్లాతండా వరకు రూ.84లక్షలతో 1.2 కిలోమీటర్ల దూరంతో రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. అనంతరం గానుగబండలో దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
నాయకుల తీరుపై మంత్రి అసహనం
గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసహనంతోపాటు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. గానుగబండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు కనీసం మైక్ సక్రమంగా ఏర్పాటు చేయలేకపోవడం పట్ల సభా ప్రాంగణంలో నాయకులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ నుంచి కల్మలచెరువులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ కూడా గానుగబండలో చేసిన అభివృద్ధి పనులపై వివరిద్దామంటే మైక్ సరిగ్గా పనిచేయలేదని ఇక్కడైనా పనిచేస్తుందా లేదా అని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటయ్య, తహసీల్దార్ బండ కవిత, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, నాయకులు పైడిమర్రి రంగనాథ్, పెండెం శ్రీనివాస్‌గౌడ్, కటికం రమేష్, మూలగుండ్ల సీతారాంరెడ్డి, బచ్చలకూరి మట్టయ్య, గుండు రామాంజిగౌడ్, చామకూరి రజిత, పరమేష్, చాందిమియా, ముత్యాలగౌడ్, సందీప్, సరిత, వెంకటరెడ్డి, యోహాన్, బచ్చలకూరి కృష్ణ, జయరాం నాయక్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ నాణ్యతాప్రమాణాలతో
రోడ్లు నిర్మించాలి
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ గరిడేపల్లిలో పలు అభివృద్ధి
పనులకు శంకుస్థాపన