
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
సూర్యాపేట : త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ యాదగిరి, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
వివరాల నమోదు వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పీఎంఏవైజీ సర్వే యాప్‌లో వివరాల నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ డీఈ, ఏఈలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. వివరాలు నమోదుకు ఈనెల 30 చివరి తేదీగా నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వెబ్ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఇన్‌స్పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
మూసీ ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తున్నందున రిజర్వాయర్ నిండుకుండలా మారుతుందని, పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూసీ నదికి శనివారం ఉదయం వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, కేతేపల్లి మండలం భీమారంలో లోలెవెల్ కాజ్ వే దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.