
ఐలమ్మ పోరాటం.. స్ఫూర్తిదాయకం
సూర్యాపేట : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలనే కసితో చాకలి ఐలమ్మ పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి అధికారులు నరసింహ, శ్రీనివాస్, శంకర్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, బీసీ సంఘం నాయకులు పద్మ, సైదులు, సత్యనారాయణపిళ్ళై, చల్లమల్ల నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్