
ఎత్తిపోతల పనులు వేగవంతం చేయాలి
మేళ్లచెరువు : ఎత్తి పోతల పథకాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం చింతలపాలెం మండలం దొండపాడు పరిధిలోని బుగ్గమాధవరంలో నిర్మిస్తున్న రాజీవ్‌లిఫ్ట్ ఇరిగేషన్ ,వె వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు పనుల పురోగతి పరిశీలించానన్నారు. వెల్లటూరు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ భూసేకరణలో సరిహద్దులు ,టైటిల్ తో పాటు ఫారెస్టు భూముల వివాదాలు ఉన్నాయని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు భూసేకరణకు రూ.30 కోట్లు రైతులకు చెల్లించామన్నారు.
సరిపడా యూరియా ఉంది
జిల్లాలోయూరియా సరిపడా ఉందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ స్పష్ట ం చేశారు. రైతులు అవసరం మేరకు తీసుకోవాలని ముందస్తుగా నిల్వ చేసుకోవద్దన్నారు. వ్యాగన్ యూరియా జిల్లాకు వచ్చిందని దానిని వ్యవసాయాధికారులు, పీఏసీఎస్‌లు, ఆగ్రోసెంటర్‌లకు సరఫరా చేసి రైతులకు అందిస్తున్నారన్నారు. కలెక్టర్ వెంట ఆర్‌డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈలు అశోక్, సత్యనారాయణ, డీఈ స్వామి, ఏఈ శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ ఆదిత్య ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్