
విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత సూచించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని నారాయణ ఇంటర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్విహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించుకోవాలని, విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలని, దానిని సాధించే వరకు కృషి చేయాలని సూచించారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, భావిపౌరులుగా ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
ఫ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత