
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల : విద్యార్థుల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శనివారం ప్రపంచ డెఫ్ డే సందర్భంగా సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ శివారులోని బధిరుల పాఠశాలను సందర్శించారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానసిక వైకల్యం గల విద్యార్థులకు ప్రతిఒక్కరూ చేయూతనందించాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ నామినేటెడ్ సభ్యురాలు నల్లపాటి మమత విద్యార్థులకు టవల్స్ పంచారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, భట్టిపల్లి ప్రవీణ్ కుమార్, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, గుంటూరు మధు, న్యాయవాదులు కె.సుధాకర్, జి.నవీన్ పాల్గొన్నారు.
ఫ జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి