తెలంగాణ సాధనలో జయశంకర్‌ కీలక పాత్ర | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాధనలో జయశంకర్‌ కీలక పాత్ర

Aug 7 2025 11:02 AM | Updated on Aug 7 2025 11:02 AM

తెలంగాణ సాధనలో జయశంకర్‌ కీలక పాత్ర

తెలంగాణ సాధనలో జయశంకర్‌ కీలక పాత్ర

భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ కీలక పాత్ర పోషించారని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి. రాంబాబుతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో పాలుపంచుకున్నారన్నారు. సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంతో పాటు, దేశంలోనే ముందంజలో ఉంచడానికి ఉద్యోగులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వి.వి. అప్పారావు, డీటీడీఓ శంకర్‌, పరిపాలన అధికారి సుదర్శన్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయిగౌడ్‌, సంతోష్‌ కిరణ్‌, శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement